News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News January 11, 2026
ఇంటి చిట్కాలు మీ కోసం

* స్టెయిన్ లెస్ స్టీల్ సింకులు మెరుపు తగ్గకుండా ఉండాలంటే, వెనిగర్‌లో ముంచిన స్పాంజ్‌తో శుభ్రం చెయ్యాలి.
* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి.
* నూనె డబ్బాల మీద బంగాళా దుంప ముక్కలతో రుద్దితే తుప్పు మరకలు రాకుండా ఉంటాయి.
* నీటిలో కాస్త వెనిగర్, లిక్విడ్ డిష్‌వాష్ కలిపి, దానిలో ముంచిన వస్త్రంతో కిటికీలను తుడిస్తే పేరుకున్న దుమ్ముపోతుంది.
News January 11, 2026
NZB: కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవడమెలా..?

నిజామాబాద్ కామారెడ్డి జిల్లా గులాబీ శ్రేణులకు కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. కానీ ఈ రెండు జిల్లాల్లో ఒక్క బాల్కొండలో బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలు ముగ్గురు ప్రభుత్వ సలహాదారులు 5 కార్పొరేషన్ పదవుల్లో ఉన్నారు. బీజేపీకి 3 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అరవింద్ ఉన్నారు. వీరందరినీ బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొని నిలబడుతుందా..? చూడాలి..!
News January 11, 2026
NSUTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT)లో 31 టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 3వరకు పంపాలి. BE/BTech/BS/ME/MTech/MS, M.Arch, MBA/PGDM/CA/ICWA/M.Com, PhD ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. అసోసియేట్ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు. సైట్: https://nsut.ac.in


