News February 4, 2025

సెహ్వాగ్, రిచర్డ్స్‌లాంటోడు అభిషేక్: హర్భజన్

image

టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, వీవీ రిచర్డ్స్ స్థానాలను టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ భర్తీ చేయగలరని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఆయన రెడ్ బాల్ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇస్తారని జోస్యం చెప్పారు. ‘అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో గణాంకాలు బాగా లేకున్నా ఇంగ్లండ్‌పై బాదిన శతకంతో టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 4, 2025

‘తండేల్’ టికెట్ల ధరల పెంపునకు అనుమతి

image

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ AP ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50(జీఎస్టీతో కలిపి) వరకు, మల్టీఫ్లెక్సుల్లో రూ.75(జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చని తెలిపింది. సినిమా రిలీజైన వారం వరకు ఈ ధరలు కొనసాగుతాయని చెప్పింది. ‘తండేల్’ మూవీ ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News February 4, 2025

మీ ఇంట్లో సర్వే అయిందా?

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సరిగ్గా చేయలేదని, ఎవరూ తమ ఇంటికి రాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంటికే కాదు తమ కాలనీల్లోని చాలా అపార్ట్‌మెంట్లలో సర్వే జరగలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ప్రజలు అందుబాటులో లేకపోవడంతో 3% మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెబుతోంది. మరి మీ ఇంట్లో సర్వే జరిగిందా? కామెంట్ చేయండి.

News February 4, 2025

ఎస్సీ వర్గీకరణ: మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు

image

TG: ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. మాదిగ జనాభా 32,33,642గా పేర్కొని, రెండో గ్రూపులో చేర్చారు. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల తదితర కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వారిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి. గ్రూప్-1కు 1, గ్రూప్-2కు 9, గ్రూప్-3కి 5% రిజర్వేషన్లను సిఫారసు చేశారు.

error: Content is protected !!