News March 19, 2024
NLG: గృహజ్యోతి దరఖాస్తులకు బ్రేక్

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గృహజ్యోతి దరఖాస్తులకు బ్రేక్ పడింది. గృహజ్యోతి దరఖాస్తులు అందజేసేందుకు సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించలేదు. దీంతో రోజంతా పడిగాపులు కాసి దరఖాస్తుదారులు తిరుగు ప్రయాణమయ్యారు. కోడ్ ముగిసే వరకు దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు తెలిపారు.
Similar News
News October 28, 2025
నల్గొండ: పిచ్చికుక్క బీభత్సం.. ఏడుగురికి గాయాలు

నల్గొండ నాలుగో వార్డు, కేశరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, రోడ్డుపై వెళ్లే బైకర్లను కూడా వెంటాడి గాయపరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ పిచ్చికుక్కను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.
News October 28, 2025
NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
NLG: గొలుసు చోరీ.. వీరిని గుర్తిస్తే పారితోషకం

త్రిపురారం మండలం నీలయ్యగూడెంలో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును తెంపుకొని వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. వారిని గుర్తించిన వారు త్రిపురారం పోలీస్ స్టేషన్లో సమాచారమివ్వాలని సూచించారు. త్రిపురారం పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70196కి కాల్ చేసి చెప్పొచ్చని హాలియా సీఐ సతీష్ రెడ్డి కోరారు. వారికి తగిన పారితోషకం ఇస్తామని తెలిపారు.


