News March 19, 2024
ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం..

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించినట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పెనుకొండకు సబ్ కలెక్టర్, హిందూపురానికి జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు ఆయా ఆర్డీవోలు, మడకశిరకు అహుడా కార్యదర్శి గౌరీ శంకర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంటుకు కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.
Similar News
News December 16, 2025
PGRSకు అన్ని శాఖల అధికారులు పాల్గొనాలి: కలెక్టర్

మండల స్థాయిలో నిర్వహించే PGRS కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ప్రతి మండలం, డివిజన్ కార్యాలయాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి హాజరయ్యేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పీజిఆర్ఎస్ కార్యక్రమానికి అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.
News December 15, 2025
ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.
News December 15, 2025
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: SP

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే ప్రతి పిటిషన్‌ను విచారించి తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 96 అర్జీలు స్వీకరించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


