News February 4, 2025
ఇది ప్రజాస్వామ్య ఓటమి: రోజా

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమి.. ప్రజాస్వామ్య ఓటమి అని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ‘తిరుపతి మేయర్ డా.శిరీషని విధుల నిర్వహణలో అవమానించారు. కార్పొరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం’ అని రోజా X వేదికగా ప్రశ్నించారు.
Similar News
News October 15, 2025
లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డికి స్వల్ప ఊరట

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.
News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్‌గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్‌టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.
News October 15, 2025
సిద్దిపేట: బాలికల పాఠశాలల్లో సీట్ల భర్తీకి రేపే లాస్ట్

సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లోని బాలికల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు డీసీఓ పోలోజు నరసింహచారి బుధవారం తెలిపారు. సిద్దిపేట రూరల్, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ములుగు సహా 13 మండలాల్లోని బాలికల పాఠశాలల్లో ఈ అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు సీట్ల కోసం ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.