News March 19, 2024

జలదంకి: గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

image

జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News November 3, 2025

ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

image

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్‌లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.

News November 3, 2025

నెల్లూరు: 1,282.63 హెక్టార్లలో పంటకు నష్టం

image

తుపాన్ కారణంగా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగిన పంట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 79,333 హెక్టార్లలో వరి సాగు చెయ్యగా 1282.63 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుసెనగ 11.4 హెక్టార్లు, మొక్క జొన్న 21.7 హెక్టార్లు, సజ్జ పంటకు 5 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.

News November 3, 2025

YCP నేతపై అర్ధరాత్రి కత్తులతో దాడి

image

వెంకటాచలం మండల YCP నేత, రాష్ట్ర ST సెల్ జాయింట్ సెక్రెటరీ బదనాపురి గోపాల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. అర్ధరాత్రి గోపాల్ ఇంట్లో ఉండగా కత్తులతో దాడికి తెగబడ్డారన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ఓ పార్టీ నేతలు తమ కుమారుడిపై దాడి చేశారని గోపాల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రికిలో చికిత్స కొనసాగుతోంది.