News February 4, 2025
కుంభమేళా తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదు: హేమామాలిని
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదని BJP MP హేమామాలిని అన్నారు. కానీ కొందరు దీనిని పెద్దదిగా చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమూ కుంభమేళాకు వెళ్లి సంగం ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించాం. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరం. ఈ ఒక్క ఘటన తప్ప కుంభమేళా అద్భుతంగా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా UP సర్కార్ కుంభమేళా మృతుల సంఖ్యను దాచిపెడుతోందని మాజీ CM అఖిలేశ్ ఆరోపించారు.
Similar News
News February 4, 2025
‘అల వైకుంఠపురంలో’ తమిళ మూవీ అన్న పూజ.. నెటిజన్ల ఫైర్
అల్లు అర్జున్, తాను కలిసి నటించిన ‘అల వైకుంఠపురంలో’.. తమిళ సినిమా అని పూజా హెగ్డే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అది తమిళ సినిమా అయినా హిందీ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారని ‘దేవా’ మూవీ ప్రమోషన్లలో పూజ కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేశారని, అంత పెద్ద హిట్ అయిన సినిమానే మర్చిపోతారా? అని ఫ్యాన్స్ పూజపై మండిపడుతున్నారు.
News February 4, 2025
మూడేళ్ల కిందటే మోనాలిసాకు ఫొటోషూట్
తేనెకళ్ల సుందరి మోనాలిసాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో ‘పరికర్మ’ మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలను సంజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’లో నటిస్తున్నారు.
News February 4, 2025
సాధువులకు బట్టలు లేకున్నా చలి పెట్టదు.. ఎందుకంటే?
ప్రయాగ్‌రాజ్‌లో గడ్డ కట్టే చలిలోనూ అఘోరాలు, నాగ సాధువులు ఒంటిపై నూలు వస్త్రం కూడా లేకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై నాగసాధువులు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘సాధన చేసినప్పుడు చలి అనేదే ఉండదు. బూడిదను శరీరానికి రాసుకుంటాం కాబట్టి చలి తక్కువేస్తుంది. దీనివల్ల రోగాలు కూడా రావు. జపం చేయడం, భగవంతుడిని ప్రార్థించడమే అతిపెద్ద వస్త్రం. ఇంకేం వస్త్రాలు అక్కర్లేదు’ అని తెలిపారు.