News February 4, 2025

BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News March 15, 2026

శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

News March 15, 2026

కార్మికులంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

image

జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. కార్మికులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఆరోగ్య సేవలను స్వయంగా సమీక్షించారు. అనారోగ్య లక్షణాలున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులంతా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 15, 2026

బెల్లంపల్లి: మరణించినా.. సజీవం ఆ కళ్లు

image

బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన పాన్ షాపు యజమాని కొట్టే సత్యప్రకాశ్(68) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది సత్యప్రకాశ్ కళ్లను సేకరించారు. శోకసంద్రంలోనూ నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన ఆ కుటుంబాన్ని ఐ బ్యాంకు నిర్వాహకులు, స్థానికులు అభినందించారు.