News February 4, 2025
BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2026
‘జిల్లాలో 6,027 సిలిండర్లు అందుబాటులో’

జిల్లాలో 6027 గ్యాస్ సిలిండర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ భాషా ఆదివారం తెలిపారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలను తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారన్నారు. ఎక్కడైనా గ్యాస్ అక్రమంగా విక్రయించినా, బరువులో తేడాలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.
News March 22, 2026
కడప జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.
News March 22, 2026
ASF జిల్లాలో పోలీసుల వసూళ్ల దందా?

జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వ్యాపారుల వద్ద నెలకు రూ.1.15లక్షలు, ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కిరాణా వ్యాపారులను సైతం వదలకుండా హఫ్తాల కోసం వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఓ CI, మరో డివిజన్ స్థాయి అధికారి వ్యాపారులను పిలిపించి వసూలు చేస్తున్నారని బాధితులు DGP శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


