News February 4, 2025
BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 4, 2025
‘దీపం పథకం 2 పటిష్ఠంగా అమలు చేయండి’
దీపం పథకం-2 పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని కోర్ట్ హాల్లో పుట్టపర్తి పరిధిలోని గ్యాస్ ఏజెంట్స్ ప్రతినిధులతో దీపం పథకం-2 సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో అర్హులైన పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.
News February 4, 2025
‘అల వైకుంఠపురంలో’ తమిళ మూవీ అన్న పూజ.. నెటిజన్ల ఫైర్
అల్లు అర్జున్, తాను కలిసి నటించిన ‘అల వైకుంఠపురంలో’.. తమిళ సినిమా అని పూజా హెగ్డే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అది తమిళ సినిమా అయినా హిందీ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారని ‘దేవా’ మూవీ ప్రమోషన్లలో పూజ కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేశారని, అంత పెద్ద హిట్ అయిన సినిమానే మర్చిపోతారా? అని ఫ్యాన్స్ పూజపై మండిపడుతున్నారు.
News February 4, 2025
జాతీయ నులిపురుగుల నివారణ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్
విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమంలో భాగంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. 1-19 ఏళ్ల లోపు వారందరూ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.