News February 4, 2025
నారాయణపేట: భార్య ఆత్మహత్య.. భర్తకు జైలు శిక్ష
భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు జైలు శిక్ష పడింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన మహేశ్‌కు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వెలు జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. అదనపు కట్నం తేవాలని వేధించడంతో 2023 మే 31న నారాయణపేట (M) సింగారం గ్రామానికి చెందిన భవాని ఉరేసుకుందని, ఆమె అన్న భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 5, 2025
మెదక్: సీఎంను సన్మానించిన మంత్రి
ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని సీఎం వెల్లడించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
News February 5, 2025
నా మందు ఇండియన్లు తాగటం లేదు: పాంటింగ్
తన కంపెనీ ‘పాంటింగ్ వైన్స్’పై భారతీయులు ఆసక్తి చూపడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. ఇండియాలో తన బ్రాండ్‌ను పంపిణీ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘ఢిల్లీలో నా కంపెనీ మద్యం బాగానే అమ్ముడవుతోంది. ఇప్పుడిప్పుడే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పన్నులు, టారిఫ్‌లు సవాళ్లుగా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. IPLలో పాంటింగ్ PBKS హెడ్ కోచ్‌గా ఉన్నారు.
News February 5, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు 3 నామినేషన్లు
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఇద్దరు, టీచర్ స్థానానికి ఒకరు నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రారంభం నుంచి నేటి వరకు మొత్తం 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, నలుగురు టీచర్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. రెండింటికి కలిపి 12మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు వేశారు.