News February 4, 2025

నేటి విద్యార్థులే రేపటి పౌరులు: మంత్రి సవిత

image

నేటి విద్యార్థులే రేపటి భవిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 37వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సవిత ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.

Similar News

News February 4, 2025

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటా: కడప ఎస్పీ

image

జిల్లాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఎటువంటి ఆపద కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ డైరీ -2025ను ఎస్పీ ఆవిష్కరించారు. ఏఎస్పీ ప్రకాశ్ బాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News February 4, 2025

హైదరాబాద్‌లో కడప వాసి మృతి

image

హైదరాబాద్‌లో భవనం పైనుంచి పడి కడపకు చెందిన సైట్ ఇంజినీర్ మిథున్ కుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కొల్లూరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. అఫ్తా గ్రీన్ హోమ్‌లో నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్తు నుంచి మిథున్ కుమార్ రెడ్డి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి సిబ్బంది హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కేసు నమోదైంది.

News February 4, 2025

నేడు కడపకు వస్తున్న ఇంఛార్జి మంత్రి సవిత 

image

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సావిత్రమ్మ నేడు కడపకు వస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!