News February 4, 2025

14వ ఏడాదీ అవకాశమిచ్చినందుకు థాంక్స్: మోదీ

image

పార్లమెంటులో వరుసగా 14వ ఏడాదీ ప్రసంగించే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలియజేశారు. తనను నాయకుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం వికసిత భారత్‌‌కు బాటలు వేసిందన్నారు. తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గరీబీ హఠావో ప్రయోగం విఫలమైందని కాంగ్రెస్‌ను విమర్శించారు. తాము పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని వెల్లడించారు.

Similar News

News January 20, 2026

నితీష్ ఫెయిలైనా అవకాశాలివ్వాలి: ఇర్ఫాన్ పఠాన్

image

NZతో జరిగిన మూడో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ నితీష్‌ను హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాకప్‌గా అభివర్ణించారు. 135km వేగంతో బౌలింగ్, భారీ షాట్లు కొట్టగల బ్యాటింగ్ సామర్థ్యం అతనికి ఉందన్నారు. వరుసగా ఫెయిలైనా మరిన్ని అవకాశాలివ్వాలని సూచించారు. కోహ్లీతో కలిసి నితీష్ నెలకొల్పిన 88 పరుగుల భాగస్వామ్యం అతని టాలెంట్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.

News January 19, 2026

రేపు ఆటోల బంద్.. క్లారిటీ

image

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్‌ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

News January 19, 2026

సిట్ విచారణకు హాజరవ్వాలని హరీశ్ నిర్ణయం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18900983>>నోటీసుల<<>> నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ పలువురు బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతారు.