News February 4, 2025
జగిత్యాల: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన BC, SC, ST అభ్యర్థులు RRB, SSC, Banking ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారు ఫిబ్రవరి 9 వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 16, 2026
జూన్‌లో 2 ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన?

TG: వరంగల్(D) మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి PM మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మామునూరుకు రూ.850 కోట్లు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు రూ.1,061 కోట్లు అవసరమని అంచనా. ఇక్కడ పౌర, మిలిటరీ విమానాలు ల్యాండయ్యేలా రన్‌వేను నిర్మించనున్నారు. అలాగే డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తారని సమాచారం.
News March 16, 2026
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోనే అతిపెద్ద పులి సంరక్షణ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నల్లమల అడవుల్లో విస్తరించిన ఈ రిజర్వ్‌లో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి అనేక వన్యప్రాణులు నివసిస్తున్నాయి. పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ పర్యవేక్షణ, కెమెరా ట్రాప్‌లు, డ్రోన్ నిఘా వంటి చర్యలు చేపడుతోంది. అడవిలో మంటలు, అక్రమ వేటను అరికట్టేందుకు ప్రత్యేక గస్తీ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.
News March 16, 2026
ప.గో: మళ్లీ పాత చోటకే PGRS వేదిక

గొల్లల కోడేరు జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గతంలో రోడ్డు పనుల వల్ల భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగేదని, పనులు పూర్తి కావడంతో తిరిగి SP కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి తమ సమస్యల విన్నపానికి నేరుగా SP కార్యాలయానికి రావాలని కోరారు.


