News February 4, 2025
పదవులు దక్కలేదన్న అసంతృప్తి చాలా చిన్నది: ప్రత్తిపాటి

AP: సీఎం కష్టంతో పోలిస్తే పదవులు దక్కలేదన్న అసంతృప్తి చాలా చిన్నది అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా ఎంపిక సరైన నిర్ణయమని తెలిపారు. ఆయన అనుభవం మండలికే వన్నె తెస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఆలపాటి గెలుపునకు ఇన్‌ఛార్జులు బాధ్యతగా పని చేయాలని ఆయన కోరారు.
Similar News
News December 30, 2025
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్!

రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా దీనిపై హీరోహీరోయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
News December 30, 2025
చర్మానికి కోకో బటర్

కోకో బటర్‌ను చాక్లెట్స్, కేక్‌ల తయారీలోనే కాకుండా చర్మాన్ని మెరిపించడానికి కూడా వాడొచ్చంటున్నారు నిపుణులు. కోకో బటర్‌లో రోజ్ వాటర్ కలిపి పడుకునే ముందు చర్మానికి అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చర్మం మెరిసేలా చేస్తుంది.
News December 30, 2025
ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చిన వెంటనే అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 23-మే 2 వరకు దరఖాస్తుల స్వీకరించనుంది. ఏప్రిల్ 6- మే 2 వరకు ఫారినర్స్, భారత సంతతి విద్యార్థులకు రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చింది.
✧ మే 4 వరకు ఫీజు చెల్లింపునకు ఛాన్స్
✧ మే 11-17 హాల్ టికెట్లు డౌన్‌లోడ్
✧ మే 17న రెండు సెషన్లలో పరీక్ష
✧ జూన్ 1న ఫలితాలు


