News February 4, 2025
తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు? బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు?’ అని మండిపడ్డారు.
Similar News
News February 5, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం
TG: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో భానుడి భగభగలు తప్పవని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు బయటకి వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈ మూడ్రోజులు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News February 5, 2025
నా మందు ఇండియన్లు తాగటం లేదు: పాంటింగ్
తన కంపెనీ ‘పాంటింగ్ వైన్స్’పై భారతీయులు ఆసక్తి చూపడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. ఇండియాలో తన బ్రాండ్‌ను పంపిణీ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘ఢిల్లీలో నా కంపెనీ మద్యం బాగానే అమ్ముడవుతోంది. ఇప్పుడిప్పుడే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పన్నులు, టారిఫ్‌లు సవాళ్లుగా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. IPLలో పాంటింగ్ PBKS హెడ్ కోచ్‌గా ఉన్నారు.
News February 4, 2025
రేపే పోలింగ్.. అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు
రేపు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నదిని హరియాణా విషపూరితంగా మారుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మనోభావాలు దెబ్బతీశారని, ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని FIRలో పేర్కొన్నారు.