News February 4, 2025

కొంపల్లి: సోదరి చిత్రపటానికి KCR నివాళి

image

కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ దశదిన కర్మకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. నేడు కేసీఆర్ సహా BRS స్థానిక శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై, నివాళులర్పించారు.

Similar News

News March 30, 2026

నిర్మల్: SDF నిధుల కోసం పాత సర్పంచుల ఎదురుచూపు!

image

నిర్మల్ జిల్లాలో 17 మండలాలు 400 గ్రామాలు ఉన్నాయి. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం SDF కింద కొన్ని పనులను కేటాయించింది. దీంతో సర్పంచులు, ఉప సర్పంచులు కార్యదర్శులతో కలిసి పనులు చేశారు. మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ నిధులు రాలేదు. వడ్డీకి డబ్బులు తెచ్చి పనులు చేసిన వారు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

News March 30, 2026

గద్వాల: ఆహార కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి – కలెక్టర్

image

హోటళ్లు, రెస్టారెంట్లలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఆహార సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి హోటళ్లు కూడా తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్, అనుమతులు పొందాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 30, 2026

GWL: ‘ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి’

image

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 85 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అట్టి ఫిర్యాదులను పరిష్కరించని అధికారులకు మెమోలు జారీ చేస్తామన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.