News February 4, 2025
రూ.3 కోట్లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ఇల్లు కట్టించిన దొంగ
షోలాపూర్‌కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్‌కు రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి(37) మైనర్‌గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగిలించిన డబ్బుతో కోల్‌కతాలో రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం వెల్లడైంది.
Similar News
News February 5, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం
TG: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో భానుడి భగభగలు తప్పవని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు బయటకి వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈ మూడ్రోజులు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News February 5, 2025
నా మందు ఇండియన్లు తాగటం లేదు: పాంటింగ్
తన కంపెనీ ‘పాంటింగ్ వైన్స్’పై భారతీయులు ఆసక్తి చూపడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. ఇండియాలో తన బ్రాండ్‌ను పంపిణీ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘ఢిల్లీలో నా కంపెనీ మద్యం బాగానే అమ్ముడవుతోంది. ఇప్పుడిప్పుడే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పన్నులు, టారిఫ్‌లు సవాళ్లుగా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. IPLలో పాంటింగ్ PBKS హెడ్ కోచ్‌గా ఉన్నారు.
News February 4, 2025
రేపే పోలింగ్.. అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు
రేపు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నదిని హరియాణా విషపూరితంగా మారుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మనోభావాలు దెబ్బతీశారని, ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని FIRలో పేర్కొన్నారు.