News February 4, 2025

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన కలెక్టర్

image

నంద్యాల మండలం పాండురంగాపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం గ్రామంలోని మధుసూదన్ రెడ్డి, కేశవ్ రెడ్డి పొలాలను పరిశీలించి, వారు అవలంభిస్తున్న విధానాలను సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి, వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ రసాయన రహిత సాగుతో వచ్చిన లాభాలను కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News March 24, 2026

ఈసీ లెటర్‌లో బీజేపీ ముద్ర.. విపక్షాల ఆగ్రహం

image

కేరళంలో ఎలక్షన్ కమిషన్‌ లెటర్‌లో <<19459684>>బీజేపీ సీల్<<>> ఉండటంపై కాంగ్రెస్, CPM తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ‘ఇది పొరపాటు కాదు. తీవ్రమైన ప్రమాద సంకేతం. రాజ్యంగబద్ధ సంస్థ క్రెడిబిలిటీ, న్యూట్రాలిటీపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎన్నికల సంఘం బీజేపీ తొత్తులా ఎందుకు ప్రవర్తిస్తోంది? దీనికి జవాబుదారీ ఎవరు?’ అని కాంగ్రెస్ Xలో ప్రశ్నించింది. బీజేపీ, EC రెండూ ఒకే ముద్రను ఉపయోగిస్తున్నాయని CPM ఫైరయ్యింది.

News March 24, 2026

WGL: అసెంబ్లీకి ఐదుగురు అతివలు!

image

పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుండటంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం కొత్త పుంతలు తొక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరిగే 16 స్థానాల్లో కనీసం 4 నుంచి 5 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో కీలక స్థానాల్లో మహిళా నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, జిల్లా నుంచి ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.

News March 24, 2026

టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా క్యాంపెయినింగ్

image

టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక క్యాంపెయినింగ్ గతేడాది జూన్‌లో ప్రారంభించినట్లు HNK జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు తెలిపారు. ఇందులో భాగంగా 1.98,000 మంది హై రిస్క్ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారు డయాబెటిక్స్, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు, హెచ్ఐవీ బాధితులు, తదితర లక్షణాలను గుర్తించామన్నారు. 75,243 మందికి ఎక్స్ రే, 19,824 మందికి తెమడ పరీక్షలు చేశామన్నారు.
#ప్రపంచ క్షయ దినం.