News February 4, 2025

DC ఓనర్ మన తెలుగు వారేనని తెలుసా?

image

IPLలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి తండ్రి ఏపీలోని రాజాంకు చెందిన GMR అధినేత గ్రంధి మల్లికార్జునరావు. ప్రస్తుతం కిరణ్ GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఢిల్లీ, HYD, గోవా ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పొందడంలో ఈయనదే కీలక పాత్ర. ఆయన సంపద $3 బిలియన్లకు పైనే. ఎవరూ ఊహించని విధంగా 2025 IPL వేలానికి ముందు పంత్‌ను వదులుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

Similar News

News July 5, 2025

సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కోచ్‌ల పెంపు

image

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్‌లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు 14 ఉండగా వాటిని 18 చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉ.5.05 గంటలకు బయల్దేరే వందేభారత్(20707) మ.1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మ.2.30 గంటలకు బయల్దేరే ట్రైన్(20708) రా.11 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.

News July 5, 2025

కొత్తగా 157 సర్కారీ బడులు

image

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.

News July 5, 2025

త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

image

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ప్రభుత్వం త్వరలో NTR బేబీ కిట్లు అందించనుంది. 2016లోనే ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్, ఆయిల్ వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి.