News February 4, 2025
సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక

ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్‌లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.
Similar News
News November 4, 2025
సృజనాత్మకతతోనే ఉన్నత విద్య: డీఈవో దక్షిణామూర్తి

విద్యార్థులు తమలో సృజనాత్మకతను పెంచుకోవాలని డీఈవో దక్షిణామూర్తి అన్నారు. బయ్యారంలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులకు కొత్త అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజరు వివరాలు, విద్యార్థుల విద్యాసామర్థ్యాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బాలు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, రూప్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News November 4, 2025
అమరావతికి రూ.32,500 కోట్ల అదనపు రుణాలు

అమరావతి రాజధాని నగరం అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి ₹14,000 కోట్లు రుణం అందే అవకాశం ఉంది. దీనితో పాటు, నాబ్‌ఫిడ్ నుంచి ₹10,000 కోట్లు, నాబార్డు నుంచి ₹7,000 కోట్లు రానున్నాయి. ఈ కొత్త నిధులతో కలిపి, సీఆర్డీఏకు ₹58,500 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. CRDA ఇప్పటికే ₹91,639 కోట్ల విలువైన 112 నిర్మాణ పనులను చేస్తోంది.
News November 4, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<


