News February 4, 2025
MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

మంచిర్యాల రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 25 ఏళ్లుంటుందన్నారు. నలుపు టీ షర్ట్, యాష్ రంగు ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. చేతిపై మామ అని టాటూ ఉందని జీఆర్పీ SI మహేందర్, హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News March 25, 2026
మారనున్న చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

ఉ.చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పురుషులదే హవా. ప్రస్తుత రాజకీయాల్లో ఒక్క మహిళా MP, MLAగా లేరు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే ఈ లెక్క మారనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏడుగురు మహిళలు MLAలు కానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే తాను MLAగా బరిలో ఉంటానని సుధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మూడు MP స్థానాల్లో ఓ స్థానం మహిళకు వెళ్లే అవకాశం ఉంది.
News March 25, 2026
మారనున్న చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

ఉ.చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పురుషులదే హవా. ప్రస్తుతం ఒక్క మహిళ కూడా MP, MLAగా లేరు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే ఈ లెక్క మారనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏడుగురు మహిళలు MLAలు కానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే తాను MLAగా బరిలో ఉంటానని సుధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మూడు MP స్థానాల్లో ఓ స్థానం మహిళకు వెళ్లే అవకాశం ఉంది.
News March 25, 2026
KNR: అసెంబ్లీలో ఐదుగురు ‘మహిళా’ మణులు?

పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుండటంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి KNR(D)లో రాజకీయం కొత్త పుంతలు తొక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో 13 నుంచి 20 స్థానాలకు పెరగనున్న నేపథ్యంలో కనీసం 4- 5 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో కీలక స్థానాల్లో మహిళా నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.


