News February 4, 2025
పెద్దపల్లి: జిల్లాలో ముగ్గురు తహశీల్దార్ల బదిలీ
పెద్దపల్లి జిల్లాలో శ్రీరాంపూర్ తహశీల్దార్ MD. వకీల్, ఓదెల తహశీల్దార్ యాకన్న, ధర్మారం తహశీల్దార్ అరీఫుద్దీన్ లను బదిలీ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో సూపరింటెండెంట్లు గా పనిచేస్తున్న పి.జగదీశ్వరరావును శ్రీరాంపూర్, జె.సునీతను ఓదెల తహశీల్దారుగా నియమించారు. శ్రీరాంపూర్ తహశీల్దార్ వకీల్‌ను ధర్మారం తహశీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Similar News
News February 5, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్
1: MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
2:మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి
3:గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
4:ALL INDIA తెలుగు CARTOONISTల డైరెక్టరీలో బెల్లంపల్లి వాసి
5:MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం
6:మంచిర్యాలలో పేకాట రాయుళ్లు అరెస్ట్
News February 5, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం
TG: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో భానుడి భగభగలు తప్పవని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు బయటకి వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈ మూడ్రోజులు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News February 5, 2025
మెదక్: సీఎంను సన్మానించిన మంత్రి
ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని సీఎం వెల్లడించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.