News February 4, 2025

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తన అభిమానులను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని అనుమతులు తీసుకొని ఈవెంట్ నిర్వహించడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ఓర్పుతో ఉండాలని కోరింది. అభిమానులు తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 5, 2025

నా మందు ఇండియన్లు తాగటం లేదు: పాంటింగ్

image

తన కంపెనీ ‘పాంటింగ్ వైన్స్’పై భారతీయులు ఆసక్తి చూపడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. ఇండియాలో తన బ్రాండ్‌ను పంపిణీ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘ఢిల్లీలో నా కంపెనీ మద్యం బాగానే అమ్ముడవుతోంది. ఇప్పుడిప్పుడే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పన్నులు, టారిఫ్‌లు సవాళ్లుగా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. IPLలో పాంటింగ్ PBKS హెడ్ కోచ్‌గా ఉన్నారు.

News February 4, 2025

రేపే పోలింగ్.. అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు

image

రేపు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నదిని హరియాణా విషపూరితంగా మారుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మనోభావాలు దెబ్బతీశారని, ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని FIRలో పేర్కొన్నారు.

News February 4, 2025

అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు.. కానీ: రొనాల్డో

image

రొనాల్డో – మెస్సీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు అని ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అన్నారు. ‘కానీ సాకర్‌ చరిత్రలో ఇప్పటివరకూ నా లాంటి ప్లేయర్‌ని చూసుండరు. నేనే కంప్లీట్, బెస్ట్ ప్లేయర్‌ని’ అని తెలిపారు. మెస్సీకి తనకు మంచి స్నేహం ఉందన్నారు. స్పానిష్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో రొనాల్డో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

error: Content is protected !!