News February 4, 2025
వరంగల్ : మేడ్చల్లో రోడ్డుప్రమాదం.. యువ డాక్టర్ మృతి

మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామానికి చెందిన యువ డాక్టర్ చుక్క శ్రీచరణ్ ఈరోజు మృతిచెందారు. గ్రామానికి చెందిన చుక్క శ్రీనివాస్ కుమారుడైన శ్రీచరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త తెలియగానే మహబూబాబాద్ మాజీ ఎంపి, BRS జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నవయసులోనే మృతిచెందడంతో విషాదం నెలకొంది.
Similar News
News February 26, 2026
ఏనుమాముల మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీ

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
News February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.
News February 26, 2026
వరంగల్: వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్‌కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


