News February 4, 2025
సిద్దిపేట: ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు: హరీశ్ రావు

అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏంటని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు.
Similar News
News November 4, 2025
TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.
News November 4, 2025
ADB: పత్తి రైతుకు మరో కష్టం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఓవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాళు కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనేవారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 క్వింటాళు కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ADBలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
News November 4, 2025
WGL: డీఈవోల బాధ్యతలో గందరగోళం!

ఉమ్మడి జిల్లాలో DEO బాధ్యతల విషయంలో గందరగోళం నెలకొంది. JNG, MLG జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా, BPHL, MHBD, WGL జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు విద్యా పరిపాలన అప్పగించడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి పూర్తి స్థాయి డీఈవోలను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.


