News February 4, 2025

సిరిసిల్ల: రీల్స్ కోసం ఈతకు వెళ్లిన బాలుడి మృతి

image

ముస్తాబాద్(M)లో ఓ బాలుడు రీల్స్ కోసం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి  గ్రామ శివారులోని ఓ చెరువులో రీల్స్ కోసం ఈత కొట్టాడు. చరణ్‌కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 20, 2026

ఇండోర్ స్టేడియం పనుల్లో జాప్యం..!

image

బాలసముద్రంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియం మరమ్మతు, సుందరీకరణ పనులు ఏడాదిగా నత్తనడకన సాగుతున్నాయి. రూ.68 లక్షలతో చేపట్టిన పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఆలస్యమవుతున్నాయి. దీంతో బ్యాడ్మింటన్ క్రీడాకారులు తాత్కాలికంగా ఇతర ప్రదేశాల్లో శిక్షణ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 20, 2026

NLG: వచ్చే నెల నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం

image

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్‌లో ఒకేసారి పంపిణీ చేయనుంది. NLG – 5,58,650, సూర్యాపేట – 3,55,057, యాదాద్రి-2,47,757 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈ పంపిణీ జరగనుంది. ఇప్పటికే
బియ్యం గోదాములకు చేరుకుంటున్నాయి.

News March 20, 2026

భారత్‌లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

image

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్‌, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.