News February 4, 2025
డిచ్పల్లి: చెరువులో పడి పశువుల కాపరి మృతి
డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి చెరువులో పడి పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. సోమవారం గ్రామానికి చెందిన బియ్యం బాబయ్య పశువులను మేపేందుకు గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. గేదలు చెరువులోకి దిగగా వాటికోసం చెరువు వద్దకు వెళ్లిన బాబయ్య ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 5, 2025
NZB: కొక్కెర వ్యాధి వల్లే కోళ్ల మృత్యువాత
కొక్కెర వ్యాధి వైరస్ వ్యాధి వలన జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు నిజామాబాద్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. వ్యాధి గ్రహిత కోళ్ల నమూనాలను నిర్ధారణ కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ వ్యాధి వలన మనుషులకు ఎలాంటి ప్రాణాపాయం కలగదని పేర్కొన్నారు.
News February 5, 2025
NZB: ముగ్గురికి జైలు శిక్ష
నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు హోటల్స్, స్నూకర్ నడిపిన ముగ్గురు వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ జడ్జీ మంగళవారం తీర్పునిచ్చినట్లు SHO రఘుపతి తెలిపారు. ఈ మేరకు సవేరా హోటల్ యజమాని షేక్ అబ్బు, మిలన్ హోటల్ యజమాని సమీర్, బోధన్ బస్టాండ్ వద్ద స్నూకర్ షాపు నడుపుతున్న మమ్మద్ షాకీర్ హుస్సేన్‌కు శిక్ష విధించినట్లు వెల్లడించారు.
News February 5, 2025
NZB: రైలులోంచి పడి వ్యక్తి మృతి
రైలులోంచి ప్రమాదవశత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైల్లోంచి పడి వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.