News February 4, 2025
దోమకొండ: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

బిక్కనూర్ మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం గుర్తు తెలియని <<15357499>>మృతదేహం<<>> లభ్యమైంది. కాగా వివరాలను SI ఆంజనేయులు వెల్లడించారు. దోమకొండ మండలం లింగుపల్లికి చెందిన ఉప్పు భూపతి(50) సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి చెరువులో దూకి అత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి సోదరుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించామన్నారు.
Similar News
News March 16, 2026
రేపే ఏపీ ఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB) నూతన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రారంభించనున్నారు. మంగళగిరి హైవేలోని మయూరి టెక్ పార్క్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు APIIC టవర్స్ నుంచి కార్యకలాపాలు సాగించగా, ఇకపై మయూరి టెక్ పార్క్ నుంచి సేవలు అందించనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా అధికారులతో లోకేశ్ భేటీ కానున్నారు.
News March 16, 2026
JGTL: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ లేఖ

జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైతులు మొక్క పంటను సాగు చేశారన్నారు. పంట కోత పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర రూ.2,400 అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 16, 2026
నంద్యాల జిల్లా కలెక్టర్ అసంతృప్తి

నంద్యాల జిల్లాలో 49,931 మంది అర్హులలో కేవలం 10,324 మంది మాత్రమే స్కిల్ డెవలప్‌మెంట్ టెస్ట్‌కు హాజరుకావడం పట్ల కలెక్టర్ రాజకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో 4,071 మంది మాత్రమే అర్హత సాధించారని తెలిపారు. మిగిలిన వారు ఎందుకు హాజరు కాలేదో అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు సాధించేందుకు క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.


