News March 19, 2024
వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,280 పలకగా.. ఈరోజు రూ.7,300 పలికింది. జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 4, 2025
వరంగల్: యువతపై కన్నేసి ఉంచాలి!

వరంగల్ జిల్లాలో విద్యార్థులు, యువతపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ముగియడంతో పిల్లల కదలికలు, అలవాట్లు, మొబైల్ వాడకంపై నిఘా పెట్టాలంటున్నారు. జిల్లాలో ఇప్పటికే గంజాయి, బోనోఫిక్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్నారని, వ్యసనంగా మారి అనర్థాలకు దారి తీయకముందే అదుపు చేయాలని కోరుతున్నారు.
News April 4, 2025
వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
News April 3, 2025
వరంగల్: 4 బార్ల లైసెన్స్‌లకు దరఖాస్తు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో రెన్యువల్ కాకుండా మిగిలిన 4 బార్లకు సంబంధించి మళ్లీ లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. అర్హులు, ఆసక్తి గలవారు ఈనెల 26 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 29న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా బార్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.