News February 4, 2025
BHPL: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: DMHO

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్.మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంవో, డాక్టర్లు, సూపర్‌వైజర్లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని సూచించారు.
Similar News
News January 3, 2026
న్యూజిలాండ్‌తో ODI సిరీస్‌కు భారత్ టీమ్ ఇదే

జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా.. షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
టీమ్: గిల్(C), రోహిత్, కోహ్లీ, రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, జైస్వాల్.
News January 3, 2026
NLG: నీటి వాటాలో ‘తెలంగాణ’కు ద్రోహం: మంత్రి ఉత్తమ్

కృష్ణ, గోదావరి జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చుక్క నీటిని కూడా బయటకు పోనివ్వబోమని స్పష్టం చేశారు.
News January 3, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : ఎస్పీ

వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈనెల 28 వరకు పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.


