News February 4, 2025
మీ ఇంట్లో సర్వే అయిందా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సరిగ్గా చేయలేదని, ఎవరూ తమ ఇంటికి రాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంటికే కాదు తమ కాలనీల్లోని చాలా అపార్ట్మెంట్లలో సర్వే జరగలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ప్రజలు అందుబాటులో లేకపోవడంతో 3% మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెబుతోంది. మరి మీ ఇంట్లో సర్వే జరిగిందా? కామెంట్ చేయండి.
Similar News
News February 5, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!
తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వ్యాపారి, వరి పొలానికి నీరు, ఏనుగుకు తొండము, సంపదకు స్త్రీ ప్రాణాధారము. అవి లేకపోతే జీవం ఉండదు.
News February 5, 2025
వరల్డ్ రికార్డుపై షమీ కన్ను
రేపు ENGతో జరిగే తొలి వన్డేలో IND పేసర్ షమీ ప్రపంచ రికార్డుపై గురిపెట్టారు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీస్తే ODIలలో అత్యంత వేగంగా 200వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలుస్తారు. ప్రస్తుతం షమీ 100 మ్యాచ్లలో 195 వికెట్లు తీశారు. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్ టాప్లో ఉన్నారు. అతను 102 మ్యాచ్లలో 200W కూల్చారు. ఆ తర్వాత ముస్తాక్-PAK(104M), ట్రెంట్ బౌల్ట్-NZ(107M), బ్రెట్ లీ-AUS(112M), డొనాల్డ్-SA(117M) ఉన్నారు.
News February 5, 2025
ఉగాది నుంచి P4: సీఎం చంద్రబాబు
AP: పేదరిక నిర్మూలనకు ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఉగాది నుంచి P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్షిప్) విధానాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా టాప్లో ఉన్న 10% మంది 20% మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పారిశ్రామివేత్తలు, NRIలు, ఇతర ధనవంతులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.