News February 4, 2025

సాధువులకు బట్టలు లేకున్నా చలి పెట్టదు.. ఎందుకంటే?

image

ప్రయాగ్‌రాజ్‌లో గడ్డ కట్టే చలిలోనూ అఘోరాలు, నాగ సాధువులు ఒంటిపై నూలు వస్త్రం కూడా లేకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై నాగసాధువులు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘సాధన చేసినప్పుడు చలి అనేదే ఉండదు. బూడిదను శరీరానికి రాసుకుంటాం కాబట్టి చలి తక్కువేస్తుంది. దీనివల్ల రోగాలు కూడా రావు. జపం చేయడం, భగవంతుడిని ప్రార్థించడమే అతిపెద్ద వస్త్రం. ఇంకేం వస్త్రాలు అక్కర్లేదు’ అని తెలిపారు.

Similar News

News February 5, 2025

నేడే ఢిల్లీ పోలింగ్.. సర్వం సిద్ధం

image

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. వరుసగా మూడో సారి గెలవాలని ఆప్, 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ, పునర్వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35వేల మంది పోలీసులు, 15వేల మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.

News February 5, 2025

మేం ముగ్గురం మిత్రులమే: గిల్

image

ఇండియా తరపున ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడినా అభినందించాలని భారత క్రికెటర్ శుభ్‌‌మన్ గిల్ అన్నారు. అభిషేక్ తన బాల్య మిత్రుడని, జైస్వాల్ సైతం మంచి స్నేహితుడని తెలిపారు. మా ముగ్గురి మధ్య ఎటువంటి పోటీతత్వం ఉండదని అన్నారు. ఇండియా కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్ బాగా ఆడేలా ప్రయత్నించాలన్నారు. అంతేగాని ఒకరు బాగా ఆడకూడదని కోరుకోవటం సరికాదని శుభమన్ పేర్కొన్నారు.

News February 5, 2025

English Learning: Antonyms

image

✒ Hapless× Fortunate, Lucky
✒ Haughty× Humble, Submissive
✒ Hideous× Attractive, alluring
✒ Heretic× Conformable, religious
✒ Harmony× Discord
✒ Hamstrung× Strengthen, Encourage
✒ Honor× Denunciation, Shame
✒ Hasty× Leisurely, Cautious
✒ Humility× Boldness, Pride

error: Content is protected !!