News February 4, 2025
మూడేళ్ల కిందటే మోనాలిసాకు ఫొటోషూట్
తేనెకళ్ల సుందరి మోనాలిసాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో ‘పరికర్మ’ మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలను సంజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’లో నటిస్తున్నారు.
Similar News
News February 5, 2025
నేడే ఢిల్లీ పోలింగ్.. సర్వం సిద్ధం
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. వరుసగా మూడో సారి గెలవాలని ఆప్, 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ, పునర్వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35వేల మంది పోలీసులు, 15వేల మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.
News February 5, 2025
మేం ముగ్గురం మిత్రులమే: గిల్
ఇండియా తరపున ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడినా అభినందించాలని భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అన్నారు. అభిషేక్ తన బాల్య మిత్రుడని, జైస్వాల్ సైతం మంచి స్నేహితుడని తెలిపారు. మా ముగ్గురి మధ్య ఎటువంటి పోటీతత్వం ఉండదని అన్నారు. ఇండియా కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్ బాగా ఆడేలా ప్రయత్నించాలన్నారు. అంతేగాని ఒకరు బాగా ఆడకూడదని కోరుకోవటం సరికాదని శుభమన్ పేర్కొన్నారు.
News February 5, 2025
English Learning: Antonyms
✒ Hapless× Fortunate, Lucky
✒ Haughty× Humble, Submissive
✒ Hideous× Attractive, alluring
✒ Heretic× Conformable, religious
✒ Harmony× Discord
✒ Hamstrung× Strengthen, Encourage
✒ Honor× Denunciation, Shame
✒ Hasty× Leisurely, Cautious
✒ Humility× Boldness, Pride