News February 4, 2025
జగిత్యాల: శిశు మరణాల రేటును తగ్గించాలి: కలెక్టర్

శిశు మరణాల రేటును తగ్గించుటకు కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం చైల్డ్ డెత్ రివ్యూ పై వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరణాలు సంభవించకుండా తప్పించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరచాలని, వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. గృహ సందర్శన సమయంలో బాలింతలకు కౌన్సెలింగ్ చేయాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

జూబ్లీహిల్స్‌లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.
News November 14, 2025
AcSIRలో 16 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(<
News November 14, 2025
కృష్ణా: రేపటి నుంచి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఎస్. జుబేదా పర్వీన్ శుక్రవారం తెలిపారు. పామర్రు (M) నిమ్మకూరు ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో 18-35 వయసు కలిగిన మహిళలకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్, మగ్గం వర్క్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.


