News February 4, 2025

జాతీయ నులిపురుగుల నివారణ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమంలో భాగంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. 1-19 ఏళ్ల లోపు వారందరూ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 5, 2025

అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పార్థసారథి వినతి

image

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం కలిసి రైల్వే గేట్ నంబర్ 197 వద్ద రోడ్డు, అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణంపై విన్నవించారు. పట్టణంలో ఈ గేటు మూసివేయడంతో మార్కెట్ యార్డ్‌కు వెళ్లాల్సిన రైతులు, కార్మికులు, పాదచారులు అదనంగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు.

News February 4, 2025

రేపటి నుంచి పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు

image

ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజుకుమార్ తెలిపారు. కర్నూలులోని బిర్లాగేట్ సమీపంలోని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంకల్ప్ పథకంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News February 4, 2025

శుభకార్యాలపై దాడులు చేస్తూ టీడీపీ పైశాచికానందం: YCP

image

శుభకార్యాలపై దాడులు చేస్తూ టీడీపీ పైశాచికానందం పొందుతోందని కర్నూలు జిల్లా YCP అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. సీ.బెళగల్ మండలం పెద్దొడ్డిలో YCP కార్యకర్తల పెళ్లికి ఆహ్వానం లేకపోయినా వెళ్లి, ఆడవారిని బూతులు తిడుతూ TDP గూండాలు దాడికి దిగారని ఆరోపించారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కోడుమూరు ఇన్‌ఛార్జ్ సతీశ్‌తో కలిసి ఆయన పరామర్శించారు. ఈ మేరకు YCP ‘X’లో పోస్టు చేసింది.

error: Content is protected !!