News February 4, 2025
జగిత్యాల మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి డీ.ప్రకాష్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన కందులను ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రూ.7,550 కనీస మద్దతు ధర పొందాలన్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం హబీబ్, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News March 26, 2026
కృష్ణా జిల్లాలో భారీగా పెరుగుతున్న గ్యాస్ బుకింగ్స్

యుద్ధ భయంతో కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా గ్యాస్ బుకింగ్‌లు పెరిగాయి. గతంలో రోజుకు 9 వేలున్న బుకింగ్‌లు, ప్రస్తుతం 30 వేలకు చేరాయి. జిల్లాలోని 42 ఏజెన్సీలు రోజుకు 12 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతుండటంతో.. ఇంకా లక్షకు పైగా కనెక్షన్లకు నిరీక్షణ తప్పడం లేదు. వారం రోజుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం గడువు విధించినా, వాస్తవానికి 10 రోజులకు పైగా సమయం పడుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
News March 26, 2026
స్పోర్ట్స్ స్కూల్లో ఎంపికలు: ఓలేటి జ్యోతి

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం 2026- 27 సం.రానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. నాలుగో తరగతి బాల బాలికలు జిల్లా పరిధిలోని 18 మండలాల్లో మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 31న ఎంపికలు జరుగుతాయని సూచించారు.
News March 26, 2026
వివిధ సంక్షోభాలను పెళ్లికి లింక్ చేసిన గోయెంకా!

నోట్ల రద్దు, కొవిడ్, ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని పెళ్లికి ముడిపెడుతూ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘2016లో అతిథుల నడుమ పెళ్లికి సిద్ధమైనా నోట్ల రద్దు వల్ల డబ్బు లేదు. అదే 2021లో కొవిడ్ వల్ల ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం. డబ్బు-గ్యాస్ అందుబాటులో ఉన్నా అతిథులు రాలేకపోయారు. 2026లో యుద్ధం వల్ల పెళ్లికి అతిథులొచ్చినా గ్యాస్ దొరకట్లేదు. 2031లో ఏం జరుగుతుందో’ అని రాసుకొచ్చారు.


