News February 5, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు 3 నామినేషన్లు

image

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఇద్దరు, టీచర్ స్థానానికి ఒకరు నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రారంభం నుంచి నేటి వరకు మొత్తం 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, నలుగురు టీచర్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. రెండింటికి కలిపి 12మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు వేశారు.

Similar News

News November 7, 2025

MP అకౌంట్ నుంచి ₹56 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

image

TMC MP కళ్యాణ్ బెనర్జీ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ₹56L మాయం చేశారు. బెనర్జీ MLAగా ఉన్నప్పుడు కోల్‌కతాలోని SBI హైకోర్టు బ్రాంచిలో తీసిన అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్‌గా ఉంది. ఇటీవల నేరగాళ్లు మార్ఫ్‌డ్ పత్రాలు, ఫొటోలతో KYCలో ఫోన్ నంబర్‌ మార్చి డబ్బు మాయం చేశారు. MP ఫిర్యాదుతో అధికారులు కేసు పెట్టారు. ‘బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు’ అని బెనర్జీ విమర్శించారు.

News November 7, 2025

నూతనకల్: యాక్సిడెంట్‌లో ఒకరు మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నూతనకల్ మండల పరిధిలోని ఎర్రపహాడ్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. పెదనేమిల గ్రామానికి చెందిన కాసోజు మురళి, జంగం లాజర్ పోలుమల్ల నుంచి బైక్‌పై పెదనేమిల వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మురళీ, లాజర్ తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్‌కు తరలించగా మురళి మృతి చెందాడు.

News November 7, 2025

డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

image

AP: తిరుమలలో DEC 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు EO అనిల్ సింఘాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి టోకెన్ల జారీ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చామని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన 2026 FEB నుంచి ఆన్‌లైన్ కోటా రిలీజ్ చేస్తామన్నారు.