News February 5, 2025

మెదక్: సీఎంను సన్మానించిన మంత్రి

image

ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని సీఎం వెల్లడించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

నిజాంపేట: ALERT.. లింక్ క్లిక్ చేస్తే రూ.45 వేలు మాయం

image

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన మౌనిక ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా వచ్చిన ఫేక్ లింకును క్లిక్ చేయడంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేలు పోయినట్లు ఎస్ఐ తెలిపారు. సెల్ ఫోన్‌లో సంబంధం లేని లింకులను, బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దని ఎస్ఐ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

News November 5, 2025

మెదక్‌లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

image

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News November 5, 2025

కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

image

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.