News February 5, 2025

వరంగల్: ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్: కలెక్టర్

image

రాబోయే వేసవిలో ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో ఎన్పీడీసీఎల్, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు.

Similar News

News April 18, 2026

ఖమ్మం: ఘోర ప్రమాదం.. నుజ్జయిన శరీరం

image

ఖమ్మం జిల్లా గోపాలపురంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సదరు వ్యక్తి శరీరం నుజ్జునుజ్జయి అవయవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అర్బన్ పోలీసుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన ఓ ఫౌండేషన్ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెల్లాచెదురుగా ఉన్న శరీరభాగాలను సేకరించి అంబులెన్స్‌లో మార్చురీకి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

News April 18, 2026

సజ్జలపై హైకోర్టు ఆగ్రహం

image

వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అనాగరికం అని మండిపడింది. అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణల మీద ఆయనపై దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. ఇటీవల తనపై ఉన్న ఉన్న లుక్ ఔట్ సర్క్యులర్‌(LOC)ను రద్దు చేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు LOCని వెనక్కు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆదేశించింది.

News April 18, 2026

WGL: పాలిసెట్‌ దరఖాస్తుకు 20 వరకు గడువు

image

పాలిసెట్‌‌ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 20 కాగా, అపరాధ రుసుం రూ.100తో 21 వరకు, రూ.300తో 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ బైరీ ప్రభాకర్ తెలిపారు. ప్రవేశ పరీక్ష ర్యాంక్ ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి సీట్లు కేటాయిస్తామని చెప్పారు. మే 13న పరీక్ష ఉంటుందని చెప్పారు. విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.