News February 5, 2025
లక్షెట్టిపేట: ‘సుస్థిర ఆస్తుల కల్పన EGSలోనూ సాధ్యం’

సుస్థిర ఆస్తుల కల్పన MNREGSలో సాధ్యమవుతుందని DRDO కిషన్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపూర్, పోతపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, ఇతర పనులను పరిశీలించారు. రైతులకు పశువుల కొట్టాలు, అజోల గడ్డి పెంపకం, నాడేపు కంపోస్ట్, చెక్ డ్యామ్స్, కిచెన్ షెడ్, పాఠశాల ప్రహరీల వంటి సుస్థిర ఆస్తులు ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్నామన్నారు.
Similar News
News July 9, 2025
పెద్దపల్లి: గానుగ వృత్తి పరిరక్షణకు ప్రభుత్వం కృషి: మంత్రి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్‌ను గానుగ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా.లెక్కల నాగేశ్ ఈరోజు పెద్దపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. గానుగ వృత్తి పరిరక్షణ, గాండ్ల యువతకు నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో గానుగలు, గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
News July 9, 2025
గిరి ప్రదక్షిణలో మాధవ స్వామి ఆలయానికి వెళ్తున్నారా..!

సింహాచలం గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది. భక్తులు ఇప్పటికే నడక ప్రారంభించారు. అయితే మాధవధారలో సింహాచలం కొండను అనుకోని ఉన్న మాధవస్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకొని గిరి యాత్ర కొనసాగించాలి. అప్పుడు మాత్రమే గిరి ప్రదక్షిణ సంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే మాధవస్వామి ఆలయం నుంచి మెట్ల మార్గాన సింహాచలానికి దారి కూడా ఉంది.
News July 9, 2025
సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

సీఎం పర్యటనకు బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఎస్పీ వి.రత్న దిశానిర్దేశం చేశారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కొత్తచెరువులో గురువారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీసులు సూచించారు.