News February 5, 2025
వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దు: భద్రాద్రి కలెక్టర్

వేసవిలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయం మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా పది రోజుల ప్రత్యేక కార్యచరణ ద్వారా తాగునీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
Similar News
News January 16, 2026
కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేయాలి?

కనుమ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మన దేహం ఓ రథమని, దానిని నడిపించేది ఆ పరమాత్ముడేనని ఈ ముగ్గు మనకు గుర్తు చేస్తుంది. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని దేవుడ్ని ప్రార్థించేందుకు ఇదో సంకేతం. అలాగే ఈ ముగ్గు సంక్రాంతికి భూలోకానికి వచ్చిన బలిచక్రవర్తికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికేందుకు కూడా వేస్తారు. ఒక ఇంటి రథం ముగ్గు తాడును మరో ఇంటి ముగ్గుతో కలపడం సామాజిక ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిదర్శనం.
News January 16, 2026
ఇరాన్ గగనతలం ఓపెన్.. ఖతర్ తిరిగొచ్చిన US బలగాలు

ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు కొంత మేర తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితులు సాధారణ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మూసివేసిన ఇరాన్ గగనతలాన్ని తిరిగి రీ-ఓపెన్ చేయగా, ఖతర్‌లోని ఎయిర్‌బేస్‌కు US బలగాలు మళ్లీ చేరుకున్నాయి. దీంతో ఇరు దేశాలూ శాంతించినట్లు స్పష్టం అవుతోంది.
News January 16, 2026
UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.


