News February 5, 2025

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు భూ సర్వే.!

image

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా ఊట్కూరు మండలంలోని తిప్రస్ పల్లి-బాపూర్ గ్రామాల మధ్య పంప్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం రెవెన్యూ సిబ్బంది, ప్రాజెక్టు సర్వేయర్‌లు భూ సర్వేను చేపట్టారు. ఏ సర్వే నంబర్లు ఎంత భూమి పోతుందన్న పూర్తి వివరాలు రైతులకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చింత రవి, RI వెంకటేష్, సర్వేయర్ కృష్ణయ్య, ఎస్ఐ కృష్ణం రాజు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

HYD: స్పాలో అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్

image

డిఫెన్స్‌కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జెనోరా స్పా మసాజ్ సెంటర్‌పై నేరేడ్‌మెట్ పోలీసుల దాడి చేశారు. ఈ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా థెరపిస్ట్‌లతో పురుషులకు క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అవసరమైన అనుమతులు లేకుండా నడిపినందుకు సంబంధిత పత్రాలు, సీసీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News November 13, 2025

పల్నాటి కోడి పందెం.. యుద్ధానికి దారి తీసింది!

image

పల్నాటి యుద్ధానికి దారి తీసిన కీలక ఘటన కోడి పందెంలో చోటు చేసుకుంది. బ్రహ్మనాయుడి కోడిపుంజు చిట్టిమల్లు, నాగమ్మ కోడిపుంజు నల్లమల్లుతో పోటీపడింది. మొదటి పందెం నల్లమల్లు గెలవగా, రెండో పందెంలో నాగమ్మ శివంగి డేగను దింపింది. ఈ పందెంలో చిట్టిమల్లు మృతి చెందడంతో, మాచర్ల రాజులు దీనిని అవమానంగా భావించారు. ఈ ఘటనే క్రమంగా ఉద్ధృతమై చివరకు పల్నాటి యుద్ధానికి నాంది పలికింది.

News November 13, 2025

ప్రభుత్వ షట్‌డౌన్ బిల్లుకు US కాంగ్రెస్ ఆమోదం

image

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడనుంది. దీన్ని ముగించే బిల్లుకు US కాంగ్రెస్‌లో ఆమోదం లభించింది. ఓటింగ్‌లో అనుకూలంగా 222 ఓట్లు రాగా వ్యతిరేకంగా 209 వచ్చాయి. ఈ బిల్లును సభ అధ్యక్షుడు ట్రంప్‌నకు పంపింది. ఆయన ఆమోదం అనంతరం 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్ ముగియనుంది.