News February 5, 2025
సిద్దిపేట: బ్యాంకు రుణాల పంపిణీ పూర్తి చేయాలి: కమిషనర్

బ్యాంకు రుణాల పంపిణీ పూర్తి చేయాలని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన పట్టణ మెప్మా ఆర్పీ రివ్యూ సమావేశం నిర్వహించారు. కాగా ఈనెల 25 ఫిబ్రవరి నాటికి కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు బ్యాంకు రుణాల పంపిణీ పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు.
Similar News
News March 9, 2026
NZB: ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో జిల్లా వాసులకు మెడల్స్

ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు మెడల్స్ సాధించారు. థాయిలాండ్‌లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గోపి 110 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంప్, 4×100, 4×400 రిలేలో 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. రఘువీర్ హ్యమర్‌త్రోలో సిల్వర్ మెడల్, షాట్ పుట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుపొందారు. దినేశ్ వాగ్మారే 4×100, 4×400 రిలేలో 2 సిల్వర్ మెడల్స్ సాధించారు.
News March 9, 2026
CI రవి నాయక్, SI ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పొక్సో కేసు ముద్దాయి విషయంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐ సస్పెండ్‌తో కలకలం రేగింది.
News March 9, 2026
శ్రీకాకుళం: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

శ్రీకాకుళం నగరం జడ్పీ ఎదురుగా APHB కాలనీకి చెందిన డబ్బీరు నిఖిత ఇటీవల మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. శ్రీకాకుళం రూరల్ నైర వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బిఎస్సీ, భువనేశ్వర్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఐబీపీఎస్ పరీక్ష ద్వారా క్లర్క్ పీవో ఉద్యోగాలకు, అలాగే ఎస్బీఐలో క్లర్క్ పోస్టుకు ఎంపికైంది. రెండు ఉద్యోగాలు ఇంటర్వ్యూ దశలో ఉన్నాయి.


