News February 5, 2025
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చాలా మండలాలలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటినే త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News March 17, 2026
కాకినాడ: మళ్లీ రూటుమార్చిన ‘పులి’.. ఈసారి..

ప్రత్తిపాడు మండలం నుంచి పులి కొద్దిసేపటి క్రితమే శంఖవరం మండలం కొంతంగి, కొత్తూరు సమీపంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం 11 హనుమాన్ బృందాలు, మూడు ట్రాంక్విలైజింగ్ టీమ్‌లు రంగంలోకి దిగి ‘టైగర్ ఆపరేషన్’ నిర్వహిస్తున్నాయి. జనావాసాలకు చేరువగా పులి కదలికలు ఉండటంతో అటవీ అధికారులు అప్రమత్తమై, గ్రామస్థులను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.
News March 17, 2026
విజయవాడలో DG రైతు బజార్లు.. ఇక ఇంటికే కూరగాయలు

మార్కెటింగ్ శాఖ, మాచింట్ సంస్థతో కలిసి విజయవాడ పటమట రైతుబజార్ నుంచి హోమ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలకు ప్లే స్టోర్ నుంచి DGRB యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. రైతుబజార్ ధరకే కూరగాయలు ఈ యాప్ నుంచి కొనుగోలు చేయవచ్చన్నారు. ఆర్డర్‌పై GST, హ్యాండ్లింగ్ ఛార్జీలు ఉంటాయని పేర్కొన్నారు. నగరవాసులు ఈ యాప్ సేవలు వినియోగించుకోవాలన్నారు.
News March 17, 2026
వికారాబాద్: మత్తు ఇచ్చి భార్యభర్తల దోపిడి

వైద్యురాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న దంపతులను సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గౌండ్ల శిరీష, భర్త సాయి కుమార్ గౌడ్ వికారాబాద్ జిల్లా వాసులు. శిరీష ఫార్మ్-డి విద్యార్థిని కావడంతో వైద్య పరిజ్ఞానంతో కార్పోరేట్ ఆస్పత్రుల్లో వృద్ధ రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. 11 తులాల బంగారం, కారు, ఫోన్లు సీజ్ చేశారు.


