News February 5, 2025
HYD: యూరిన్ శాంపిల్ లేకుండానే ఇన్ఫెక్షన్ల గుర్తింపు!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సహాయంతో యూరిన్ శాంపిల్ తీసుకోకుండానే మూత్ర ఇన్ఫెక్షన్లను గుర్తించి.. HYD సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా సైన్వీ బయోసైన్స్, ఆస్ఫైర్ బయోనెస్ట్ సంయుక్తంగా మోడల్ ఆవిష్కరించింది. 2024లో జరిగిన AI ఆధారిత ఆవిష్కరణల్లో ప్రపంచ స్థాయిలో 24వ ర్యాంకును ఈ మోడల్ దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఏఐ అద్భుతాలు సృష్టించబోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News November 2, 2025
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా.. 31,612 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.98 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
News November 2, 2025
రాయికల్: కారు ఢీకొని రెండు గేదెలు మృతి

రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామ శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల – రాయికల్ ప్రధాన రహదారిలో ఉప్పుమడుగు గ్రామ శివారులో రెండు గేదెలు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మరణించాయి. కాగా, చెట్ల పొదల చాటు నుంచి అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమైంది.
News November 2, 2025
75 తాళ్లూరులో చేతబడి కలకలం

పెదకూరపాడు మండలం 75 తాళ్లూరులో చేతబడి కలకలం రేగింది. కూలి పనులు చేసే అన్నదమ్ములు కొచ్చర్ల శ్రీనివాసరావు, డేవిడ్ కుమార్ ఇళ్ల మెట్లపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి తల వెంట్రుకలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు కుంకుమ ఉంచారు. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


