News February 5, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ: డీఈవో

గ్రామపంచాయతీ ఎన్నికలకు శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు రేపు హైదరాబాదులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లా నుంచి వివిధ పాఠశాలలో పనిచేస్తున్నా 10 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
బెల్లంపల్లి: మరణించినా.. సజీవం ఆ కళ్లు

బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన పాన్ షాపు యజమాని కొట్టే సత్యప్రకాశ్(68) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది సత్యప్రకాశ్ కళ్లను సేకరించారు. శోకసంద్రంలోనూ నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన ఆ కుటుంబాన్ని ఐ బ్యాంకు నిర్వాహకులు, స్థానికులు అభినందించారు.
News March 15, 2026
సంగారెడ్డి: రేపటి నుంచి ఒంటి పూట బడి

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 16 నుంచి ఒంటి పూట బాటలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా రెండు పూటలా పాఠశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 15, 2026
సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’ వెబ్‌సైట్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు కేవలం ప్రత్యక్షంగానే కాకుండా ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.


