News February 5, 2025

అనకాపల్లి: ‘క్యాన్సర్ పట్ల భయాందోళనలు వద్దు’

image

క్యాన్సర్ పట్ల భయాందోళనలు వద్దని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం విశాఖలో నిర్వహించిన పబ్లిక్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను వైద్యులు ప్రజలకు వివరించాలన్నారు.

Similar News

News September 17, 2025

HYD: 3 రోజులుగా అశోక్ ఆమరణ దీక్ష..!

image

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ సెప్టెంబర్ 15వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించగా, నేడు మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, తక్షణమే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.

News September 17, 2025

ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

image

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.

News September 17, 2025

ములుగు: బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలపై రైతులు ఫైర్.. నిరసన ప్రదర్శనకు సన్నద్ధం!?

image

తన ఆస్తి మొత్తం ఇస్తా.. ములుగు కలెక్టర్‌ను వదిలిపెట్టొద్దంటూ బీఆర్ఎస్ నేత, విత్తన కంపెనీ ఏజెంట్ నర్సింహమూర్తి చేసిన వ్యాఖ్యలపై మొక్కజొన్న రైతులు ఫైర్ అవుతున్నారు. నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాల కారణంగా జిల్లాలో 671 మంది 1521 ఎకరాల్లో నష్టపోయారు. కలెక్టర్ దివాకర చొరవతో జులై 7న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క చేతుల మీదుగా రూ.3.8 కోట్లు పరిహారం ఇచ్చారు.