News February 5, 2025
NTR: సదస్సుల ద్వారా 96% అర్జీలు పరిష్కరణ- కలెక్టర్

రెవెన్యూ సదస్సుల ద్వారా 96% అర్జీలను పరిష్కరించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 33 రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 3,111 పిటిషన్‌లు రాగా 3,015 అర్జీలు పరిష్కారం పూర్తయిందన్నారు. అర్జీ అందుకున్నప్పుడే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి తగిన సూచనలు తెలియజేస్తున్నామన్నారు.
Similar News
News April 16, 2026
సిద్దిపేట: నిరుద్యోగుల ప్రత్యేక కోచింగ్

సిద్దిపేట ఐటీ టవర్‌లో ఉన్న టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతి, యువకులకు టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులపై శిక్షణ ఇస్తునట్టు టాస్క్ మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 16,17,18 తేదీలలో ఐటీ టవర్ టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. బీటెక్, డిగ్రీ పాస్ అయిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు టాస్క్ కేంద్రంలో సంప్రదించాలన్నారు.
News April 16, 2026
కర్నూలు: అనారోగ్యం బారిన పడినా.. ఇంటర్‌లో అద్భు ప్రతిభ

కర్నూలు(D) పెద్దకడుబూరుకు చెందిన బొగ్గుల హరిత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వ్యవసాయ కూలీలు బొగ్గుల పరమేశ్, జ్యోతి దంపతుల కుమార్తె హరిత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడినా ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరై 1000 మార్కులకు 956 మార్కులు సాధించింది. ఆమె విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హరిత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>


