News February 5, 2025

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించండి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు వస్తాయని సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో రైతుల అవగాహన కోసం 5 మోడల్ ప్రాజెక్టులు ఎంపిక చేయాలని సూచించారు.

Similar News

News October 26, 2025

యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 26, 2025

ఏయూ విద్యార్థులకు 2 రోజులు సెలవులు

image

తుఫాన్ నేపథ్యంలో ఏయూ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు ఈనెల 27, 28వ తేదీల్లో తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.రాంబాబు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 2 రోజులపాటు సెలవులు ప్రకటించామని, విద్యార్థులు హాస్టల్స్‌లో సురక్షితంగా ఉండాలని సూచించారు. అటు అనకాపల్లి జిల్లాలో 29 వరకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

News October 26, 2025

ఎన్టీఆర్: రేపటితో ముగియనున్న గడువు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(NMMS) పరీక్షకై నమోదు చేసుకున్న విద్యార్థులు సోమవారంలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 7న NMMS పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 31లోపు DEO అధికారి ఎన్టీఆర్ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులు ధృవీకరిస్తారని పేర్కొంది. https://portal.bseap.orgలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చంది.